సెట్ లో జుట్లు పట్టుకొని కొట్టుకున్న హీరోయిన్స్….

nikesha-patel-iniyaఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ పెట్టుకోవడం అంటే ఏ దర్శకుడికైన, నిర్మాతకైన కట్టి మీద సాము లాంటిదే..సినిమా పూర్తి ఆయె వరకు వారి మద్య ఎటువంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ లాంటివి చేయకోడదు. ఇగోలు లేకుండా ఇద్దరు భామలూ కలసి పోతే ఓకే.. లేదంటే మాత్రం చిత్రయూనిట్ కు చెమటలు పట్టడం ఖాయం. తాజాగా ఓ కోలీవుడ్వి చిత్రం విషయంలో ఇదే జరిగింది.

తమిళ చిత్రంలో కలసి నటిస్తున్న నిఖిషా పటేల్, ఇనియా మధ్య మాటల యుధ్ధం మొదలై.. జుట్టులు పట్టుకునే వరకు వచ్చింది. అసలు మేటర్ ఏమిటంటే.. కరైయోరమ్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్న నిఖిలా పటేల్, ఇనియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత శత్రుత్వం పెరిగిందట. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నుంచి కాస్ట్యూమ్స్ ప్రయారిటీ వరకు ప్రతి విషయంలోనూ… ఇద్దరూ తెగ పోటీ పడుతున్నారట. ఇలా పోటీల మీద పోటీల కారణంగా.. వీరిద్దరి మధ్య పెరిగిన దూరం ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధానికి దారితీసింది.

నిఖిషా, ఇనియా షూటింగ్ లొకేషన్ లోనే ఇద్దరు జుత్తు పట్టుకుని మరీ గొడవకు దిగి సెట్స్ లో గొడవ గొడవ చేశారట. ప్రస్తుతం ఈ గొడవ గురించి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు.